నవతెలంగాణ-హైదరాబాద్ : తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సర్కార్ ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం ఏ మూలకూ సరిపోదని వ్యాఖ్యానించారు. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యం కొనాలన్నారు.
The post నష్టపోయిన రైతులకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: కవిత appeared first on Navatelangana.
Leave A Comment