• Login / Register
  • Site Logo

    నలిగిన బతుకులు

    Rss వార్తలు

    నలిగిన బట్టలుపేదరికపు మచ్చలు,నలిగిన దేహాలుమోసపోయిన మనసులు. నలిగిన బంధాలువిఫలమైన ప్రేమలు,నలిగిన హృదయాలుకన్నీటి సముద్రాలు. నలిగిన మనసులువేదనలకు తావులు,నలిగిన మనుషులునిరాశల స్థావరాలు. నలిగిన అక్షరాలుచెప్పలేని వేదనలు,నలిగిన కాగితాలుదాచిపెట్టుకున్న కలలు. నలిగినా…జీవితాలు పూర్తిగా విరగవు,బూడిదలో దాగిన నిప్పుల్లాఒక రోజు తిరిగి మండుతాయి. నలిగిన ప్రతీ మనిషి లోపలఒక అగ్ని నిద్రపోతుంది –అది తప్పక లేస్తుంది,రేపటి ఉదయమవుతుంది. నలిగిన పువ్వులుసువాసనలు చల్లుతాయి,నలిగిన బంగారముకాంతులు చిమ్ముతాయి. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్‌

    The post నలిగిన బతుకులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment