నవతెలంగాణ – హైదరాబాద్ : నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి సిట్ బృందం చేరుకుంది. ఆయన నివాసంలోని రెండో ఫ్లోర్‌లో సిట్ విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి సిట్ అనుమతించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు హరీష్, కేటీఆర్, సంతోష్‌లకు మాత్రమే అనుమతినిచ్చారు. అధికారులు విచారణను వీడియో రికార్డు చేయనున్నారు.
The post నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ appeared first on Navatelangana.
Leave A Comment