నవతెలంగాణ-హైదరాబాద్: థాయ్‌లాండ్‌లో ఓ స్కూల్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. సోంఘ్‌క్లా ప్రావిన్స్‌లో ఉన్న స్కూల్‌లోకి ఒక దుండగుడు జొరబడి విద్యార్థులు, ఉపాధ్యాయులపై విచక్షణ రహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, థాయ్‌లాండ్‌లోని ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 18 సంవత్సరాల కుర్రాడు అని, అతడు పలుమార్లు తన తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని ఒక పోలీసు అధికారి వెల్లడించారు. […]
The post థాయ్‌లాండ్ స్కూల్లో కాల్పుల కలకలం appeared first on Navatelangana.
Leave A Comment