నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏది కొనాలన్నా పావుకేజీ రూ.30 పైనే ఉండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. పలు రకాల కూరగాయలు కేజీ రూ.100-120 పలుకుతున్నాయి. రైతు బజార్లతోపాటు వారపు సంతల్లోనూ ఇవే ధరలు ఉంటున్నాయని వాపోతున్నారు. ఇక ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినడంతోనే ధరలు పెరిగాయని సదరు వ్యాపారులు చెబుతున్నారు.
The post తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కూరగాయల ధరలు appeared first on Navatelangana.
Leave A Comment