నవతెలంగాణ – హైదరాబాద్: సినీ నటుడు నారా రోహిత్, తన సతీమణి శిరీష (సిరి)తో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
The post తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా రోహిత్ దంపతులు appeared first on Navatelangana.
Leave A Comment