నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నమోదవుతున్న టైఫాయిడ్ మరణాల్లో తెలంగాణ టాప్ 2లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2023లో టైఫాయిడ్, పారా టైఫాయిడ్ వల్ల దేశవ్యాప్తంగా 1000 మంది మరణించారు. దీంట్లో 202 మరణాలతో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా 377 మరణాలతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. యూపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న తెలంగాణలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.
The post డేంజర్ జోన్లో తెలంగాణ appeared first on Navatelangana.
Leave A Comment