నవతెలంగాణ – మద్నూర్ మద్నూర్ మండల కేంద్రానికి చెందిన చౌడేకర్ రామ్, కలస్కర్ నీలేష్ జుక్కల్ నియోజకవర్గ స్థాయి బ్యాట్మీంటన్ డబుల్స్ టోర్నమెంట్లలో ప్రథమ బహుమతితో విజేతగా నిలిచారు. పెద్ద కొడప్గల్ మండలం చిన్న తక్కడ్ పల్లి గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచులో చిన్న కొడప్గల్ జట్టును ఓడించి విజేతగా నిలిచినట్లు రామ్, నీలేష్ ‘ తెలిపారు. నియోజకవర్గ స్థాయి బ్యాట్మెంటల్ టోర్నమెంట్లో విజేతలుగా నిలువడం పట్ల మద్నూర్ గ్రామస్థులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
The post డబుల్స్ బ్యాట్మెంటల్ విజేతగా నిలిచిన మద్నూర్ వాసులు appeared first on Navatelangana.
Leave A Comment