• Login / Register
  • Site Logo

    జనగామ జీపీకి భారత రాజ్యాంగం బహుకరించిన ఎస్ఆర్ ఫౌండేషన్

    Rss వార్తలు

    నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీబీపేట్ మండలంలోని జనగామ గ్రామపంచాయతీకి భారత రాజ్యాంగాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలు, పౌరుల హక్కులు – బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, ఉప సర్పంచ్ యం ఎన్ స్వామి, మాజీ వైఎస్ ఎంపిపి కప్పెర రవీందర్ రెడ్డి, వార్డు మెంబర్లు, యువకులు తదితరులు పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

    The post జనగామ జీపీకి భారత రాజ్యాంగం బహుకరించిన ఎస్ఆర్ ఫౌండేషన్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment