• Login / Register
  • Site Logo

    జనగామ, సిద్దిపేట జిల్లాల పరిధిలో పెద్దపులి..

    Rss వార్తలు

    నవతెలంగాణ-హైదరాబాద్ : జనగామ, సిద్దిపేట జిల్లాల పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. నర్మేట మండలం అమ్మాపూర్ పెద్దపులి కనిపించింది. ఇది రెండు దూడలను చంపినట్లు స్థానికులు తెలిపారు. పులి సంచారంపై అటవీశాఖ సిబ్బందికి రైతులు సమాచారం ఇచ్చారు. పాదముద్రల ఆధారంగా పులి జాడ కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇది సంచరించినట్లు చెబుతున్నారు.

    The post జనగామ, సిద్దిపేట జిల్లాల పరిధిలో పెద్దపులి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment