• Login / Register
  • Site Logo

    ఛత్తీస్గఢ్లో మహిళా మావోయిస్టు సరెండర్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌లో రూ.17 లక్షల రివార్డు ఉన్న మహిళా మావోయిస్టు లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఖైరాగఢ్‌-చుయిఖాదన్‌-గండై (కెసిజి) జిల్లాలో గురువారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయారని అన్నారు.కమలా సోది(30) బస్తర్‌లోని మాడ్‌ డివిజన్‌లో, మధ్యప్రదేశ్‌-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ (ఎంఎంసి)జోన్‌లో నిషేధిత సిపిఐ(మావోయిస్ట్‌)లో చురుగ్గా పనిచేసేవారని కెసిజి పోలీస్‌ సూపరింటెండెంట్‌ వెల్లడించారు. ఆ సంస్థ సైనిక విభాగంలో హార్డ్‌కోర్‌ సభ్యురాలిగా, ఎంఎంసి జోన్‌ కమాండర్‌ రామ్‌దార్‌ నేతృత్వంలోని బృందంలో భాగంగా ఉన్నారని అన్నారు. ఆమె సుక్మా జిల్లాలోని అర్లాంపల్లి గ్రామానికి చెందినవారు.

    The post ఛత్తీస్‌గఢ్‌లో మహిళా మావోయిస్టు స‌రెండ‌ర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment