• Login / Register
  • Site Logo

    చౌదర్ పల్లిలో ఘనంగా బాలల దినోత్సవం

    Rss వార్తలు

    నవతెలంగాణ – దుబ్బాక మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా శుక్రవారం అక్బర్ పేట భూంపల్లి మండలం చౌదర్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వరూప ఆధ్వర్యంలో ‘ బాలల దినోత్సవాన్ని’ ఘనంగా జరుపుకున్నారు. నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి స్మరించుకున్నారు. చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్ లు పంపిణీ చేశారు. అనంతరం అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. పంచాయతీ కార్యదర్శి దివ్య, అంగన్వాడీ టీచర్ విజయ, పలువురు పాల్గొన్నారు.

    The post చౌదర్ పల్లిలో ఘనంగా బాలల దినోత్సవం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment