• Login / Register
  • Site Logo

    చాంపియన్ భారత్

    Rss వార్తలు

    అంతర్జాతీయ పోలో చాంపియన్‌షిప్‌ హైదరాబాద్‌ : అంతర్జాతీయ పోలో చాంపియన్‌షిప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్‌లోని హెచ్‌పిఆర్‌సిలో జరిగిన ‘6 గోల్‌’ విభాగం పోటీల ఫైనల్లో ఫ్రాన్స్‌పై భారత్‌ 18-15తో గెలుపొందింది. తొలి చుక్కర్‌లో5-3, రెండో చుక్కర్‌లో 6-2తో భారత్‌ పైచేయి సాధించగా.. మూడో చుక్కర్‌లో ఫ్రాన్స్‌ 5-4తో ముందంజ వేసింది. ఓవరాల్‌గా 3 గోల్స్‌ తేడాతో భారత్‌ విజేతగా నిలిచింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విజేతలకు బహుమతులు అందజేశారు.

    The post చాంపియన్‌ భారత్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment