• Login / Register
  • Site Logo

    ఘోర రోడ్డు ప్రమాదం..నిండు ప్రాణం పోతుంటే నిల్చుండిపోయారు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: గుంటూరు జిల్లా కురగల్లులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఓ వ్యక్తి అదుపుతప్పి స్కూటీపై నుంచి కింద పడిపోయాడు. అతని పైనుంచి లారీ దూసుకెళ్లింది. అంత పెద్ద ప్రమాదం జరిగినా.. అక్కడున్న ఎవరూ కనీసం పట్టించుకోలేదు. అసలు ప్రమాదమే జరగనట్లుగా వ్యవహరించారు. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

    The post ఘోర రోడ్డు ప్రమాదం..నిండు ప్రాణం పోతుంటే నిల్చుండిపోయారు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment