నవతెలంగాణ-మర్రిగూడమండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం సద్గురు సంతు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని సేవాలాల్ మహారాజ్ మందిరం నుండి వట్టిపల్లి ఎక్స్ రోడ్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ సర్పంచ్ వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్,కొండూరు సర్పంచ్ సీతారాం నాయక్,మాజీ సర్పంచ్ కుంభం మాధవరెడ్డి,మర్రిగూడ ఉపసర్పంచ్ రమేష్,తండా యూత్ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
The post ఘనంగా సంతు సేవాలాల్ జయంతి వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment