• Login / Register
  • Site Logo

    గంగవరం బీచ్లో యువకుడు గల్లంతు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖలోని గంగవరం బీచ్ సమీపంలోని మాధవస్వామి టెంపుల్ వద్దకు ఒడిశాకు చెందిన నలుగురు యువకులు సందర్శనకు వెళ్లారు. వారిలో రూపక్ సాయి అనే యువకుడు బీచ్ వద్ద రాళ్లపై నిలబడి ఉండగా.. ఒక్కసారిగా ఎగసిపడిన కెరటాల తాకిడికి సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడు పెదగంట్యాడ మండలం సీతానగరంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

    The post గంగవరం బీచ్‌లో యువకుడు గల్లంతు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment