• Login / Register
  • Site Logo

    కొమురంభీంలో మావోయిస్టుల కలకలం.. గాలింపు చర్యలు ముమ్మరం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ఓ మావోయిస్టు దళం జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు ఆసిఫాబాద్, తిర్యాణి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి. డోర్లి-పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించిన కిట్ బ్యాగులు, సామగ్రిని గుర్తించారు. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, సహకరించవద్దని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

    The post కొమురంభీంలో మావోయిస్టుల కలకలం.. గాలింపు చర్యలు ముమ్మరం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment