నవతెలంగాణ – రాయికల్మండలంలోని కొత్తపేట రాజరాజేశ్వర నాగాలయంలో నిర్వహించే శివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆలయ కమిటీ, మండల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ నాగార్జున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, టాయిలెట్లు, వైద్య, రవాణాఅంబులెన్స్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సై సుధీర్ రావు పకడ్బందీ బందోబస్తు ఉంటుందని, ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించాలని తెలిపారు. సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
The post కొత్తపేటలో శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష appeared first on Navatelangana.
Leave A Comment