నవతెలంగాణ – హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్.. అయినా నగరాన్ని విస్మరించారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ ఫార్మా రంగానికి హైదరాబాద్ ప్రసిద్ధి. కొవిడ్ సమయంలో కీలక ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఎగుమతి చేసింది. ఆడియో, వీడియో, గేమింగ్, మెడికల్ టూరిజం హబ్‌గా ఉంది. ఆరెంజ్ ఎకానమీలోనూ హైదరాబాద్‌ను చిన్నచూపు చూశారు. మూసీ పునరుజ్జీవన పథకానికీ నిధులు ఇవ్వలేదు’’ అని భట్టి వ్యాఖ్యానించారు.
The post కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై చిన్నచూపు: డిప్యూటీ సీఎం భట్టి appeared first on Navatelangana.
Leave A Comment