నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘోర ఓటమిపాలైంది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కాంగ్రెస్ అభ్యర్థిపై ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తూనే ఉంటామన్నారు. ‘‘నిర్విరామంగా కష్టపడిన కేసీఆర్ బృందానికి ధన్యవాదాలు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పనిచేసిన కార్యకర్తలకు నమస్సులు. జూబ్లీహిల్స్‌లో స్థానిక నాయకత్వం చాలా కష్టపడింది’’ అని కేటీఆర్ అన్నారు.
The post కష్టపడిన కేసీఆర్ బృందానికి ధన్యవాదాలు : కేటీఆర్ appeared first on Navatelangana.
Leave A Comment