• Login / Register
  • Site Logo

    ఏపీలో పాఠశాల బస్సు బోల్తా..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విజ‌య‌న‌గ‌రం జిల్లా అల‌జంగి వ‌ద్ద సెవెంత్ డే ప్ర‌యివేటు పాఠ‌శాల బ‌స్సు బోల్తా పడింది. దీంతో 22 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన విద్యార్థుల‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. పాఠ‌శాల బ‌స్సులో ఎంత మంది విద్యార్థులు ప్ర‌యాణిస్తున్నారు, బోల్తా ప‌డ‌టానికి గ‌ల కార‌ణాలు వంటి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

    The post ఏపీలో పాఠ‌శాల‌ బ‌స్సు బోల్తా.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment