• Login / Register
  • Site Logo

    ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఎక్సైజ్‌ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.కోటి, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. సౌమ్య విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విదాలుగా అండగా ఉంటుందన్నారు. ఎక్సైజ్‌ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకూర్చుతామన్నారు. నిజామాబాద్‌లో జనవరి 23న గంజాయి అక్రమ రవాణాదారులు వాహనంతో ఢీకొట్టి, తొక్కించేయడంతో సౌమ్య మృతిచెందింది. 

    The post ఎక్సైజ్‌ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment