ఊరట మాటలు ఎక్కువయిమూటల ఊటలు లేక జీవితం బీటలు తీసినప్పుడు‘వెయ్యి’ ముద్రతో జరాయువువృద్ధాశ్రమంలో ఎండమావుల్ని లెక్కిస్తాడు!చెయ్యని పాపానికిశిలువ వేయబడ్డ వయసుతమస్సులో మునిగిపోతుంది‘వెయ్యి’నే పదిసార్లు లెక్కపెడతాడుపదివేలని భ్రాంతి చెందుతాడు!‘విజను’, ‘రివిజను’, ‘రైజింగు’ఏవో నీరు లేని మేఘాలైఆశలు చూపుతుంటాయి!‘వెయ్యికి’ ఏవో జోడించాలి‘జీవో’ మాత్రం ప్రవేశించదు!ఇన్నాళ్ల చాకిరీ తర్వాతచెరకుపిప్పికి ఏం మిగులుతుంది?గద్దెనెక్కిన వాళ్లుసొంత లాభం కొంత చూసుకున్న తర్వాతేవాలిపోతున్న పొద్దుని పలకరిస్తారు!‘వెయ్యి’ జీవులని వైతరణి తీరానికి సాగనంపాకవికసిత భారతం శ్రావ్యంగా మైకుల్లో వినబడుతుంది!అచ్చేదిన్ చప్పట్లతోహస్తిన దద్దరిల్లిపోతుంది!
The post ఎండమావులు appeared first on Navatelangana.
Leave A Comment