నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్రానికి చెందిన కర్రే వార్ పండరి అనే యువకుడు ఆకుపైన అంబేద్కర్ బొమ్మను గీసి అందరిని ఆకర్షించారు. ఈనెల 26న సోమవారం జరుపుకునే గణతంత్ర దినోత్సవం పురస్కరించు కొని ఆకు పై అంబేద్కర్ బొమ్మను గీసినట్లు పండారి పేర్కొన్నారు. ఈ అద్భుత బొమ్మను తిలకించిన స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు, పలువురు పండారిని అభినందిస్తున్నారు.
The post ఆకుపై కళాకారుడి ప్రతిభ appeared first on Navatelangana.
Leave A Comment