నవతెలంగాణ-హైదరాబాద్ : మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. కాకినాడతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు అందాయని తెలిపారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందన్నారు. ఎక్సైజ్ అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని.. అధిక ధరలకు విక్రయాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.
The post అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చర్యలు : పవన్‌కల్యాణ్ appeared first on Navatelangana.
Leave A Comment