పాప్ కార్న్ లంగ్ !
పాప్ కార్న్ అంటే .మొక్క జొన్న బొరుగులు
తెలుగు రాదు . ఇదొక ఖర్మ
లంగ్స్ అంటే ఊపిరి తిత్తులు !
మరి పాప్ కార్న్ లంగ్స్ అంటే ఏంటి ?
ఇదొక ప్రాణాంతక వ్యాధి .
దీని అసలు పేరు బ్రాంకైటిస్ ఓబిలిటేరన్స్ .
కొన్ని లక్షల మంది పిల్లలు నేడు ఈ వ్యాధితో సతమతమవుతున్నారు .
సినిమా థియేటర్ లలో ... మాల్స్ లో.. మైక్రోవేవ్ పాప్ కార్న్ కొన్నారా ?
దానికి .. బట్టర్ ఫ్లేవర్ { వెన్నె రుచి } ఉంటే పిల్లలు లొట్టలేస్తూ ఎంజాయ్ చేసివుంటారు .
ఆ వెన్నె రుచి ఎలా వచ్చింది ?అని మనం అడగం .
ఎవరూ చెప్పరు.
అదొక కృతిమ రుచి .
ఆ రుచి రావడానికి డిఐసిటిల్ రసాయనాన్ని వాడుతారు .
ఇది ముఖ్యంగా పిల్లల్లో బ్రాంకటైస్ ను కలిగిస్తుంది .
పాప్ కార్న్ తినడం వల్ల వచ్చింది కాబట్టి డాక్టర్స్ దీనికి పాప్ కార్న్ లంగ్స్ అని పేరు పెట్టారు .
వ్యాధి వస్తే ఏమవుతుంది ?
లక్షల్లో ఖర్చు .
ప్రాణం పోవచ్చు .
ఫ్లేవర్డ్ కాఫీ లో... కొన్ని రకాల ప్రొసెస్డ్ ఫుడ్స్ లో... ఇదే డిఎసిటైల్ వాడుతారు .
ఇది పెద్దల పై తక్కువ ప్రభావం చూపుతుంది .
పిల్లలు తట్టుకోలేరు .
ప్రకృతి ... ఎన్నో రకాల రంగుల్ని రుచుల్ని మనకు అందించింది . దాన్ని ఎంజాయ్ చెయ్యడం సహజం .. న్యాయం .
కృతిమ రంగులు .. కృతిమ రుచులకు మనం అలవాటు పడి.. పిల్లల్ని... అలవాటు చేస్తే ?
కనీసం... ఆ కృత్రిమ రంగు... రుచి ఎలా వచ్చి చచ్చింది ?
అని తెలుసుకొనే ప్రయత్నం చేయకపోతే ?
కృతిమ రంగు , కృత్రిమ రుచి .. నీ ఆస్తిని కాజెయ్యడానికి ఫార్మసురుడు... నీకు ... ముఖ్యంగా... నీ పిల్లలకు వేసే గాలెం .
చిక్కారా .. చచ్చారే !
ప్రాణాల మీదకు తెచ్చే మరి కొన్ని కృత్రిమ రంగుల రుచుల వివరాలు ఇవిగో ...
1 . అస్పర్టమ్ !
డైట్ కోక్.. డైట్ పెప్సీ .. షుగర్ ఫ్రీ గమ్... లో క్యాలోరీ డెసెర్ట్ .. కొన్ని దగ్గు మందులు లో.. వాడుతారు
{ ముందు ఇది చెప్పండి .. కప్ సిరప్ దగ్గు దగ్గించుకున్నోళ్ళు ఉన్నారా?}.
అస్పర్టమ్ వల్ల తలనొప్పి, ఫిట్స్, ఎలర్జీ , కాన్సర్ వచ్చే ప్రమాదం .
2 సుక్రాలోస్ !
బఫెట్ డిన్నర్ లలో.. షుగర్ ఫ్రీ ఐస్ క్రీం... షుగర్ ఫ్రీ స్వీట్ అనగానే ఎగబడి తింటారు .. చాలామంది .
సుక్రాలోస్ వాడడం వల్ల దానికి ఆ తీపి వచ్చింది .
ఇది గట్ హెల్త్ ను దెబ్బ తీస్తుంది .
డయాబెటిస్ వుంది కదా .. షుగర్ ఫ్రీ తింటే ఏమి కాదు అనుకొంటారు
సరిగ్గా అక్కడే ఇది దెబ్బ వేస్తుంది .
బ్లడ్ షుగర్ కంట్రోల్ తప్పేలా చేస్తుంది .
3. టార్ట్రజిన్ !
"మా వాడు మహా చురుకు .. మహా ఆక్టివ్" ..
... అని కొంతమంది పేరెంట్స్ మురిసి పోతుంటారు .
రోగానికి... తెలివికి.. తేడా తెలియని అజ్ఞానం అది .
నేడు కొన్ని లక్షల మంది పిల్లలలు హైపర్ ఆక్టివిటీ తో .
నింపాదిగా 2-3 నిముషాలు కూర్చోలేరు .
ఒకే సారి రెండు మూడు పనులు చేస్తారు .
కారణం టార్ట్రజిన్ .
దీన్ని మౌంటెన్ డ్యూ డ్రింక్స్ లో... కొన్ని రకాల కాండీస్ లో... ప్రొసెస్డ్ ఫుడ్స్ లో వాడుతారు .
4. రెడ్ -40 .:
ఫాంటా లాంటి సాఫ్ట్ డ్రింక్స్ లో.. అనేక రకాల కాండీస్ లో... కాస్మెటిక్స్ లో వాడుతారు .
ఇది కూడా హైపర్ ఆక్టివిటీ కి కారణం కావొచ్చు .
అలాగే కాన్సర్ కు కూడా .
5. సోడియం నైట్రిట్ 6. BHA !
ఆహారాన్ని నిల్వ చేయడానికి వాడుతారు .
కాన్సర్ కు ... హార్మోన్ సమస్యల కు ఇవి కారణం కావొచ్చు .
ఇప్పుడు మీరడిగే ప్రశ్న !
ఈ కాలం పిల్లలు ... పాపకార్న్... కాండీస్ ... ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా ఎలా బతకాలి ?
ముందుగా ఒక విషయం తెలుసుకోండి .
ఈ కాలం పిల్లలు .. ఆ కాలం పిల్లలు అంటూ.. వేరువేరుగా ఉండరు. వెయ్యేండ్ల క్రితం పుట్టిన పిల్లయినా...
... మరో వెయ్యేళ్ళ తరువాత పుట్టే పిల్లయినా..
శరీర ధర్మాలు ఒక్కటే .
ఈ సత్యాన్ని మరిస్తే అధోగతే .
ఇంట్లో పాపకార్న్ చేసి తింటే సమస్య ఉండదు .
సమస్య... కృత్రిమ రంగులు .. రుచులు... ఇంకా ... ఆహారం చెడిపోకుండా వాడే రసాయనాలతో .
రసాయనాలు తింటారా ?
తింటే బతక గలుగుతారా??
మీరు ..
మీరు కాదు లెండి ..
ఈ "కాలం పిల్లలకు" కొన్ని సహజ రంగులు రుచులు పరిచయం చెయ్యండి .
Leave A Comment