వర్షంలో ఆశ్చర్యం!
------------------------
దక్షిణ కొరియాలో, చాలా ప్రత్యేకమైన కళాఖండం వీధుల్లో దాగి ఉంది. వర్షం పడినప్పుడే మాత్రమే అది తనను తాను చూడనిస్తుంది.
ప్రత్యేకమైన, కనిపించని పెయింట్‌ను ఉపయోగించి, పువ్వులు, జంతువులు, చిన్న సందేశాలు తడిగా ఉన్న కాలిబాటలపై అకస్మాత్తుగా కనిపిస్తాయి. అయితే ఎండినప్పుడు అవేవీ కనిపించవు.
బూడిదరంగు, వర్షపు రోజులలో రంగు రంగుల దృశ్యంగా మారుతుంది. ఇది బాటసారులను ఆశ్చర్యపరుస్తుంది. వారిని ఆహ్లాదపరుస్తుంది.
ఈ అసాధారణ ప్రాజెక్టును "ప్రాజెక్ట్ మాన్సూన్" అని పిలుస్తారు. ఇది వర్షంలో కూడా అందం, ఆనందాన్ని కనుగొనే సృజనాత్మక ప్రయత్నమే అని అంటారు.
- యామిజాల జగదీశ్
Leave A Comment