• Login / Register
  • Site Logo

    ఫ్రాన్స్‌లో, మిగిలిపోయిన రొట్టె కూడా ఒక కథ చెబుతుంది.

    హోమ్
    .అనేక ఫ్రెంచ్ పట్టణాల్లో, బేకరీలు అమ్ముడు పోని రొట్టెలను పారేస్తారు.
    వారు దానిని వీధుల్లోని “బోయిట్ ఎ పెయిన్ పార్టేజ్” (అది ఫ్రెంచ్ మాట.
    అంటే షేర్డ్ బ్రెడ్ బాక్స్‌లు అన్న మాట) లో ఉంచుతారు. వాటిని ఎవరైనా ఉచితంగా తీసుకోవచ్చు. ఆ బాక్సులకు తాళాలు ఉండవు. ఉచితంగా ఇస్తున్నాం కదాని పాడైపోయిన వాటిని బాక్సుల్లో ఉంచరు. తినగలిగే వాటినే ఉంచుతారన్న మాట. అవి మంచి రొట్టెలే. వాటిని సమాజ స్ఫూర్తితో పంచుకుంటారు. అంతేతప్ప మంచి రొట్టెలు వృధా పోకూడదన్నది బేటరీ యజమానుల అభిప్రాయం.

    స్థానికులు ఈ విధానాన్ని “రొట్టెతో సంఘీభావం” అని పిలుస్తారు.

    ఇంతకూ ఇది ఎందుకు ముఖ్యమో చూద్దాం :

    ఐరోపాలో అత్యంత వృధాగా పోతున్న ఆహార పదార్థాలలో బ్రెడ్ ఒకటి.  దానిని చెత్తబుట్ట నుండి దూరంగా ఉంచి అవసరమైన ఆకలి తీర్చాలన్నది వారి ఆశయం.

    కష్టాల్లో ఉన్న కుటుంబాల నుండి వృద్ధుల వరకు ఎవరైనా గౌరవంగానే ఈ రొట్టెను తీసుకోవచ్చు. అంతేతప్ప ఎవరూ ఎవర్నీ హేళన చేయడం మంటూ ఉండదు.‌ వాటిని తీసుకోవడానికి తోపులాటలు ఉండవు.

    ఇది దాతృత్వం కాదు. ఇది పరస్పర సహాయం.... ఇరుగు పొరుగువారు  సహాయం చేసుకోవాలనే గుణానికి అద్దం పట్టాలంటారు.

    ఆహార వ్యర్థాలను అరికట్టడానికి, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఫ్రాన్స్ చేపట్టిన విస్తృత ఉద్యమంలో ఈ గ్రాస్‌రూట్ ప్రాజెక్టులు ఓ భాగం. 

    వీటిని తరచుగా స్థానిక స్వచ్ఛంద సేవకులు లేదా ఎన్జీవోలు నిర్వహిస్తాయి. కొన్నిసార్లు బేకరీల మద్దతుతో వారు పారవేయడానికి బదులుగా పంచుకోవడానికి ఇష్టపడతారు. దయకు చిహ్నంగా భావిస్తారు.

    ప్రపంచవ్యాప్తంగా మరిన్ని నగరాలుకూడా దీనిని ఆదర్శంగా తీసుకుని అనుసరిస్తే బాగుంటుందని వారి ఆశ.

    - యామిజాల జగదీశ్
    Download Main Image

    Leave A Comment