దిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీని రామోజీ గ్రూప్ సీఎండీ సీహెచ్
కిరణ్, ఈటీవీ సీఈఓ బాపినీడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనాడు 50 ఏళ్లు,
ఈటీవీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని ప్రధాని మోదీతో
పంచుకున్నారు. ఈ వేడుకల మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా రామోజీ గ్రూప్
సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావుతో తన అనుబంధాన్ని ప్రధాని గుర్తు
చేసుకున్నారు. ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమాన్ని గుజరాతీలో ఎంతో ఇష్టంగా
వీక్షించే వాడినని చెప్పారు. తెలుగులో నేటికీ ఈ కార్యక్రమాన్ని
కొనసాగిస్తున్నట్లు ప్రధానికి కిరణ్ వివరించారు. చిరుధాన్యాలతో తయారయ్యే
‘సబల మిల్లెట్స్’ ఉత్పత్తుల గురించీ తెలియజేశారు. వాటి గురించి విలువైన
సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరగా... అందుకు ప్రధాని సహృదయంతో అంగీకరించారు. ఈ
ఉత్పత్తుల ద్వారా పేద మిల్లెట్ రైతులకు అండగా నిలుస్తున్నందుకు ప్రధాని
సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
Leave A Comment