పరవాడ, (విశాఖ సమాచారమ్):.భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) బీఆర్ గవాయ్ పై మతోన్మాద న్యాయవాది రాకేష్ కిషోర్ దాడికి నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో లంకెలపాలెం జంక్షన్లో మంగళవారం నిరసన కార్యక్రమం చేశారు.ఈ నిరసన ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ *దేశ అత్యున్నత న్యాయస్థానం లో ఉన్న చీఫ్ జస్టిస్ గవాయ్ పై మతోన్మాదుల దాడి అత్యంత హేయమైనదని ఈ ఘటనకు పాల్పడ్డ ఉన్మాదిని దేశద్రోహిగా పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం దాడి చేస్తూ పబ్బం గడుపుతోందని, మతోన్మాదుల ప్రభావంతోనే రాకేష్ లాంటి వాళ్లు పెట్రేగిపోతున్నారని, దళితులు, గిరిజనులు మైనార్టీలపై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి చేయడంతో పాటు వారి హక్కులను కూడా హరిస్తోందని అన్నారు. దేశాన్ని సనాతనధర్మం పేరుతో మతోన్మాదులు నాశనం చేస్తున్నారని, ఈ దుర్మార్గాలని ఎదిరిస్తున్న వాళ్లపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇది రాజ్యాంగంపై దాడిగానే పరిగణిస్తున్నామని, మతోన్మాదులకు అత్యున్నత స్థానాల్లో ఉన్న వారన్న, రాజ్యాంగం పైన నమ్మకం లేదని అందుకే రాజ్యాంగాన్ని మారుస్తామని అనేకమార్లు ప్రకటించారని దాంట్లో భాగంగానే సిజెఐపై దాడి జరిగిందని అన్నారు. మతోన్మాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలని గని శెట్టి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే వెంకట్రావు, పెంటారావు, రమణ, సత్తిబాబు, సూరిబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు
Leave A Comment