• Login / Register
  • Site Logo

    సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు

    హోమ్
    సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు


    చర్ల: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసుల ఎదుట 18 మంది మావోయిస్టులు మంగళవారం లొంగిపోయారు. పీఎల్‌జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్‌లో చురుకుగా ఉన్న నలుగురితో సహా 18 మంది లొంగిపోయారు. వారిలో 10 మందిపై గతంలో మొత్తం రూ.38 లక్షల రివార్డు ప్రకటించారు. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ముందు వీరు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నక్సల్ రహిత గ్రామ పంచాయతీ పథకం కింద సాధించిన విజయంగా దీన్ని ఎస్పీ పేర్కొన్నారు.

    ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో పెద్దఎత్తున మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో వీరు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
    Download Main Image

    Leave A Comment