సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున
సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున
కుమారుడి వివాహ వేడుకకు ఆహ్వానం
అమరావతి, విశాఖ సమాచారం:
: ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అగ్ర కథానాయకుడు నాగార్జున మంగళవారం కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి త్వరలో జరగనున్న తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ వేడుకకు ఆహ్వానించారు. అనంతరం ఆయనతో కాసేపు మాట్లాడారు. గతేడాది నవంబర్‌లో అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వీరి పెళ్లి తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అధికారికంగా వివాహ తేదీ వెల్లడిరచనప్పటికీ.. జూన్ 6న వీరి పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే నాగార్జున తెలంగాణ సీఎంను రేవంత్ రెడ్డిని కూడా అఖిల్ వివాహానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
Leave A Comment