• Login / Register
  • Site Logo

    లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఆరుగురు దుర్మరణం

    హోమ్
    లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
    ఆరుగురు దుర్మరణం

    16 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం 
    మృతులంతా చిత్తూరు వాసులే

     బెంగళూరు:  కర్ణాటకలోని హోస్కొటె వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో మూడు నెలల చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. మృతులను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వాసులుగా గుర్తించారు.  తిరుపతి నుంచి ఏపీ 03 జెడ్‌ 0190 నెంబర్‌ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. కోలారు జిల్లా  హోస్కొట్‌లోని పుట్టిపురా గేట్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.  కేశవరెడ్డి(44), తులసి(21), ప్రణతి(5), ఏడాదిన్నర వయసున్న చిన్నారి ప్రమాద స్థలంలోనే   మృతిచెందారు.  మరో ఇద్దరు ఆస్పత్రిలో కన్నుమూశారు.   16 మంది గాయపడ్డారు. వీరిని  స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
       కాగా, కర్ణాటక హోస్కొటె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
    Download Main Image

    Leave A Comment