• Login / Register
  • హోమ్

    రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి ప్రోత్సాహం

     రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి ప్రోత్సాహం

    దిల్లీ: రక్షణరంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ( ఏఎంసీఏ) ఎగ్జిక్యూషన్ మోడల్‌ను సిద్ధం చేయడానికి మంత్రి రాజ్‌నాథ్ సింగ్  ఆమోదం తెలిపారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డీఆర్‌డీవో-ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) దీనిని అమలు చేయనుంది. అమ్కా (ఏ ఎం సి ఏ)ను రూపొందించడంలో ఈ ప్రక్రియ కీలక మైలురాయిగా నిలవనుంది.
    భారత్‌ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (అమ్కా) నమూనాను తొలిసారి ఏరో ఇండియా-2025’లో ప్రపంచానికి చూపించారు. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఎలక్ట్రానిక్‌ పైలట్, నెట్‌ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ లోహ విహంగాన్ని మానవ సహితంగా, మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ఏడీఏ దీని డిజైన్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కు చెందిన వేమ్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ ఫ్యాబ్రికేషన్‌ పనులు చేసింది.

    Leave A Comment