ఇంటర్నెట్‌డెస్క్: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత సైనిక దళాలకు అత్యాధునిక ఆయుధాలను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికను మోదీ (PM Modi) సర్కారు ఆవిష్కరించింది. దాదాపు 15 ఏళ్ల వ్యవధిలో ఈ లక్ష్యాలను పూర్తి చేసేలా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఇందుకోసం భారీ మొత్తంలో వెచ్చించేందుకు సిద్ధమైంది. కనీసం 500కు తగ్గకుండా హైపర్‌సోనిక్ క్షిపణులను దళాలకు ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ విజన్ డాక్యుమెంట్ ప్రకారం పాత టీ-72 (T72 Tank) యుద్ధట్యాంక్‌లను 1800 అత్యాధునిక ఫ్యూచర్ ట్యాంక్‌లతో భర్తీ చేయనున్నారు. మరో 400 తేలికపాటి ట్యాంక్‌లను దళాలకు అందించనున్నారు. ట్యాంక్‌పై నుంచి ప్రయోగించే 50,000 యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, 6,00,000 శతఘ్ని గుండ్లు, మానవ రహిత విమానాలను సమకూర్చుకోనుంది. వీటితోపాటు 700 రోబోటిక్ కౌంటర్ ఐఈడీ సిస్టమ్‌లను రంగంలోని దించాలని నిర్ణయించింది.
ఇక నౌకాదళం (Indian Navy) కోసం సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 10 అత్యాధునిక ఫ్రిగెట్‌లు, 7 అడ్వాన్స్‌డ్ కార్వెట్టీలు, 4 ల్యాండ్ డాక్ ప్లాట్‌ఫారమ్స్, హెలికాప్టర్లకు ప్లాన్ చేస్తోంది. వీటితో పాటు అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, ఎలక్ట్రోమాగ్నెట్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వాయుసేన (Indian Air Force) కోసం 75 హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్స్, 150 స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, 100 రిమోట్ సాయం పనిచేసే విమానాలు, గైడెడ్ ఆయుధాలు, 20 స్ట్రాటోస్పియరిక్ ఎయిర్ షిప్‌లను సమకూర్చనుంది. 21 శతాబ్ధంలో ఎదుర్కొనేందుకు వీలుగా సైన్యాన్ని తీర్చి దిద్దాలని లక్ష్యంగా పెట్టుకొంది.
Leave A Comment