• Login / Register
  • Site Logo

    ప్రధాని మోదీ చేతులమీదుగా ₹18,000 కోట్ల PM-KISAN నిధుల విడుదల — 9 కోట్ల రైతులకు లబ్ధి

    హోమ్

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన భారీ రైతు సమ్మేళనంలో, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు PM-KISAN పథకం 21వ విడతగా ₹18,000 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ నిధులు 9 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమ అయ్యాయి.

    ఈ కార్యక్రమం “ప్రకృతి వ్యవసాయానికి పునాదులు — దక్షిణ భారత సదస్సు” మళ్లీ ముఖ్యాంశంగా నిలిచింది. మోదీ మాట్లాడుతూ, “రైతు సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం. PM-KISAN ద్వారా ప్రతి చిన్న రైతు కుటుంబానికి బలాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం” అని తెలిపారు.

    ఈ పథకం కింద ప్రతి లబ్ధిదారుడికి సంవత్సరానికి ₹6,000 మూడుసార్లుగా విడతలుగా అందుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ పథకం ద్వారా రూ. 2 లక్షల కోట్లకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్లాయి.
    ఈ విడతతో కలిపి మొత్తం లబ్దిదారుల సంఖ్య 11 కోట్లకి చేరింది.

    ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, తమిళనాడు గవర్నర్, పలువురు రాష్ట్ర మంత్రులు, వేలాదిగా రైతులు పాల్గొన్నారు. సభ వేదికపై మోదీ రైతులతో ముఖాముఖి చర్చలు కూడా జరిపారు.

    రైతులు మాట్లాడుతూ, ఈ రకమైన నేరుగా ఖాతాల్లోకి వచ్చే ఆర్థిక సాయం తమకు రుణ భారాన్ని తగ్గించడంలో, విత్తనాలు/ఎరువుల కొనుగోళ్లలో మద్దతుగా నిలుస్తోందని పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధానాలు, పారిశ్రామిక సహకారాలతో వ్యవసాయానికి లింకేజీలు వంటి అంశాలపై కూడా ప్రధాని దృష్టి సారించారు.

    Download Main Image

    Leave A Comment