• Login / Register
  • Site Logo

    ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ భేటీ

    హోమ్
    దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో (PM Modi) ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) భేటీ అయ్యారు. కేంద్ర సాయం, పెండింగ్‌ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో ఆయన చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది.

    రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని ప్రధానిని లోకేశ్‌ కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని.. ఉన్నతవిద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15నెలలుగా కేంద్రం సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను ఆయన వివరించారు. ప్రధాని స్పందిస్తూ.. రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఈ సందర్భంగా ప్రధానికి లోకేశ్‌ బహుకరించారు. 

    నేడు పలువురు కేంద్ర మంత్రులతో లోకేశ్‌ సమావేశం కానున్నారు. మే 17న తన సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్‌లతో మోదీని కలిసిన లోకేశ్‌.. నాలుగు నెలల వ్యవధిలో మళ్లీ ప్రధానమంత్రిని కలవడం విశేషం.
    Download Main Image

    Leave A Comment