• Login / Register
  • Site Logo

    పాడేరు మండలంలో 300 ఆర్‌డీఎస్ కిట్‌ల పంపిణీ ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

    హోమ్
    జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్.జె.వి రామ్మోహన్ రావు

    పాడేరు /జి మాడుగుల ,(విశాఖ సమాచారం):- అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలంలోని డి. గొందురు, రాములు పుట్టు గ్రామాల్లో రైతుల కోసం 300 ఆర్‌డీఎస్ (రబీ డ్ర్య్ సౌయింగ్) సీడ్ కిట్‌లను రైతు సాధికార సంస్థ  పంపిణీ చేసింది. రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్.జె.వి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఆర్‌డీఎస్ విధానం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా, ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే పంటలు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ అన్నారు. ముఖ్యంగా, బహుళ పంటల సాగు (మల్టీ - క్రాపింగ్) యొక్క ఆవశ్యకతను వివరించారు. ఈ పద్ధతిని అనుసరింస్తే రైతులకు ఏడాది పొడవునా నిరంతర ఆదాయం లభిస్తుందన్నారు. అనంతరం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ స్వయంగా రైతులకు ఆర్‌డీఎస్ కిట్‌లను అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక రైతు సమాఖ్య సభ్యులు, వి.ఓ. (విలేజ్ ఆర్గనైజేషన్) ప్రతినిధులు, ట్రాన్స్‌ఫర్మేషన్ ఎన్‌ఎఫ్‌ఏ (న్ఫా) కె. బాబాజీ మరియు రైతు సాధికార సంస్థ - ఏపీసీఎన్‌ఎఫ్ (రీస్ –ఏపీసీన్ఫ్) సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

    Download Main Image

    Leave A Comment