• Login / Register
  • Site Logo

    పడవలపై యోగాసనాలు.. ప్రపంచ రికార్డు

    హోమ్
    పడవలపై యోగాసనాలు.. ప్రపంచ రికార్డు

      విజయవాడ, విశాఖ సమాచారం: యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసేందుకు ఎన్టీఆర్‌ జిల్లా అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని ప్రముఖమైన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ నిపుణులతో యోగాసనాలు వేస్తూ, వాటి ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారు. ఈ క్రమంలో బుధవారం విజయవాడలో బెరం పార్కు వద్ద కృష్ణా నదిలో పడవలపై పలువురు యువత యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    Download Main Image

    Leave A Comment