ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడితే ఇకపై నేరుగా కోర్టుకు హాజరుకావాల్సి వస్తుంది.
సజ్జనార్ మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడేలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదు. ముఖ్యంగా మొబైల్ వాడకం వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
ట్రాఫిక్ శాఖ ఇప్పటికే నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు ప్రారంభించింది. ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రధాన రహదారులు, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో పర్యవేక్షణ పెంచారు.
అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ, రహదారులపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నియమాలను పాటించాలని, మొబైల్ వాడకం పూర్తిగా నివారించాలని సూచించారు.
Leave A Comment