న్యూఢిల్లీ: అమెరికా ప్రభుత్వం H-1B వీసా విధానాలలో చేసిన మార్పులు భారతీయ టెక్ రంగంపై కొత్త దిశ చూపుతున్నాయి. ముఖ్యంగా వీసా ఫీజులు పెరగడం, కొత్త నియమాలు కఠినతరం కావడంతో, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ టెక్ ఉద్యోగులు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశాలు (reverse brain drain) పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నిపుణుల అంచనా ప్రకారం, AI, SaaS, Deep-Tech రంగాల్లో భారతదేశంలో ఇప్పటికే వేగంగా పెరుగుతున్న అవకాశాలు ఈ వాప్సీ ట్రెండ్ వల్ల మరింత విస్తరించనున్నాయి. అధిక నైపుణ్యంతో కూడిన మానవ వనరులు తిరిగి రావడం వల్ల స్టార్టప్‌లు, గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లు, రీసెర్చ్ హబ్‌లు వంటి రంగాలు బలపడతాయని భావిస్తున్నారు.
👉 ఈ పరిణామం భారతదేశం “టెక్ టాలెంట్ హబ్”గా మరింత ప్రాముఖ్యత సాధించే అవకాశాన్ని ఇస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Leave A Comment