• Login / Register
  • Site Logo

    గ్రేట్‌ ఇండియన్‌ సేల్: శాంసంగ్‌ Galaxy S24 Ultraపై బిగ్‌ డిస్కౌంట్‌

    హోమ్

    Galaxy S24 Ultra sale price | ఇంటర్నెట్‌ డెస్క్‌: శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 అల్ట్రాపై అమెజాన్‌ ఎప్పుడూ లేనంత భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ నెల 23న ప్రారంభంకానున్న గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఈ ఫోన్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఈ ఏడాదిలో గెలాక్సీ ఎస్24 అల్ట్రాపై ఈ స్థాయిలో డిస్కౌంట్‌ ప్రకటించడం ఇదే తొలిసారి. ఫ్లాగ్‌షిప్ కోసం చూస్తున్నవారికి, మరీ ముఖ్యంగా శాంసంగ్‌ నుంచి కోరుకునే వారు ఈ సేల్‌లో గెలాక్సీ ఎస్24 అల్ట్రాను పరిశీలించొచ్చు.

    గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 అల్ట్రాను రూ.71,999కే విక్రయించనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. ఇది ఎటువంటి బ్యాంక్‌ డిస్కౌంట్లు కలపకుండా ఈ ధరకు లభిస్తోంది. కార్డు ఆఫర్‌తో కలుపుకొంటే దీని ధర మరింత దిగి రానుంది. ఎస్‌బీఐ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌ ఈఎంఐపై 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. నో-కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు, అమెజాన్‌పే వంటి డీల్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ధర సుమారు లక్ష రూపాయలు ఉంది.

    ఇక ఫోన్‌ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 2024 జనవరిలో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్ ఇప్పటికీ బెస్ట్ స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా నిలుస్తోంది. విడుదలైన ఏడాదిన్నర తర్వాత కూడా ఈ ఫోన్ ప్రీమియం ధరకే లభిస్తోంది. సేల్స్ సీజన్‌లలో దీని ధర గణనీయంగా తగ్గుతుంది. జులైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో దీని ధర రూ.74,999గా ఉంది. దీంతో పాటు శాంసంగ్‌ ఫోన్ల ధరలు కూడా తగ్గాయి. సేల్‌లో గెలాక్సీ ఎం36 5జీ ఫోన్‌ రూ.13,999, గెలాక్సీ ఏ55 రూ.23,999, గెలాక్సీ ఎం06 రూ.7499, గెలాక్సీ ఎం16 రూ.10,499కి లభించనున్నాయి.


    Download Main Image

    Leave A Comment