• Login / Register
  • Site Logo

    గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా హుస్సేన్‌ సాగర్‌ వద్దకు సీఎం

    హోమ్
    హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ వద్ద నిమజ్జనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్వయంగా పరిశీలించారు. భక్తులు, సందర్శకులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భాగ్యనగర్‌ ఉత్సవ సమితి వేదికపై నుంచి భక్తులకు అభివాదం చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులతో కలిసి నినాదాలు చేశారు. క్రేన్‌ నెం.4వద్ద నిమజ్జనాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను కలెక్టర్‌ హరిచందన సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా విధుల్లో పాల్గొన్న అన్ని విభాగాల సిబ్బందిని సీఎం అభినందించారు. నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ముందస్తు సమాచారం లేకుండా సాదాసీదాగా సీఎం రేవంత్‌రెడ్డి హుస్సేన్‌ సాగర్‌ వద్ద ప్రత్యక్ష కావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా హుస్సేన్‌ సాగర్‌ వద్దకు సీఎం వచ్చి ఏర్పాట్లను పరిశీలించడం పట్ల భాగ్యనగర్‌ ఉత్సవ్‌ సమితి ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
    Download Main Image

    Leave A Comment