• Login / Register
  • హోమ్

    కొత్త రోబో పనిమనిషి

    కొత్త రోబో పనిమనిషి


    ఇంటి పనులు చేయటంలో రోబోలు రోజురోజుకీ తెలివి మీరుతున్నాయి. ఏ ఇంట్లోనైనా.. అంటే ఇంతకు ముందు తమకు తెలియని ప్రదేశాల్లోనూ పనిచేసేలా రూపొందుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) శిక్షణతో కొత్త చోట్ల కూడా ఇంటిని శుభ్రం చేయటం, పక్క సర్దటం వంటి పనులు నేర్చేసుకుంటున్నాయి.
    ఇంటి పనులు చేయటంలో రోబోలు రోజురోజుకీ తెలివి మీరుతున్నాయి. ఏ ఇంట్లోనైనా.. అంటే ఇంతకు ముందు తమకు తెలియని ప్రదేశాల్లోనూ పనిచేసేలా రూపొందుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) శిక్షణతో కొత్త చోట్ల కూడా ఇంటిని శుభ్రం చేయటం, పక్క సర్దటం వంటి పనులు నేర్చేసుకుంటున్నాయి. ఫలితంగా రోజువారీ పనులకు ఉపయోగపడే రోబోలు మరింత విస్తృతం కావటానికి మార్గం సుగమమవుతోంది. 

    చాట్‌జీపీటీ వంటి టూల్స్‌కు శిక్షణ ఇచ్చే లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడళ్లు (ఎల్‌ఎల్‌ఎమ్స్‌) రోబోల పనితీరు మెరుగు పడటానికీ ఉపయోగ పడుతున్నాయి. మాటల ఆదేశాలను అర్థం చేసుకొని, వాటి ప్రకారం నడచుకోవటంలో పురోగతి సాధిస్తున్నాయి. కాకపోతే చాలా రోబోలు తాము శిక్షణ పొందిన వాతావరణంలోనే సరిగ్గా పనిచేస్తుంటాయి. కొత్త, తెలియని ప్రదేశాల దగ్గరికి వచ్చేసరికి వీటి నైపుణ్యం గణనీయంగా పడిపోతుంది. ఇలాంటి ఇబ్బందిని అధిగమించటానికే ఫిజికల్‌ ఇంటెలిజెన్స్‌ అనే రోబోటిక్‌ కంపెనీ సరికొత్త కృత్రిమ మేధను రూపొందించింది. దీని పేరు పై0.5. గతంలో ఎన్నడూ చూడని ఇళ్లలో రోబోలు పనిచేయటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. ఈ మోడల్‌కు అనూహ్య వనరుల నుంచి సేకరించిన విస్తృతమైన డేటాతో శిక్షణ ఇవ్వటం గమనార్హం. ప్రయోగశాలలో, ఇంటి వాతావరణాల్లో పనిచేసే వేర్వేరు రకాల రోబోలకు చెందిన సమాచారంతో పాటు వెబ్‌ నుంచి సంగ్రహించిన ఇమేజ్, వస్తువుల డేటాతోనూ పనులను నేర్పించారు. అనంతరం పై0.5 మోడల్‌తో కూడిన రోబోలు ఎలా పనిచేస్తున్నాయో పరీక్షించారు. వీటికి సింక్‌లో పాత్రలను పెట్టటం, విడిచిన దుస్తులను బుట్టలో వేయటం వంటి పనులు చేసేలా సూచనలు ఇచ్చారు. అయితే అన్నిసార్లూ ఇవి కచ్చితంగా పనిచేయలేదు. కానీ ఎక్కువ ఇళ్లలో పరీక్షించటం ద్వారా అంచనా వేసే సామర్థ్యం మెరుగు పడుతూ రావటం విశేషం. లాంగ్వేజ్‌ మోడళ్లకు ఎంత ఎక్కువ డేటాతో శిక్షణ ఇస్తే అంత మెరుగ్గా పనిచేస్తున్నట్టుగానే పై0.5 కూడా సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోందన్నమాట. ఉదాహరణకు- ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణ వాతావరణంలో పరీక్షించిన వాటితో సమానంగానే 100 ఇళ్లలో పనిచేసిన రోబో పనిచేయగలదన్నమాట. ఇలాంటి మోడళ్లు ఎట్టకేలకు పనులను జనరలైజ్‌ చేయగల స్థితికి చేరుకోవటం ఆసక్తి కలిగిస్తోందని, రోబోలను నిజ వాతావారణాల్లోకి తీసుకురావటానికివి తోడ్పడగలవని పరిశోధకులు చెబుతున్నారు. కాకపోతే ఈ రోబోలు మనుషుల కన్నా చాలా తక్కువ వేగంతో పనిచేస్తుండటం అడ్డంకిగా నిలుస్తోంది. దీన్ని అధిగమించగలిగితే ఇంటి పనులు చేసే రోబోలు చాలాచోట్ల ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.

    Leave A Comment