• Login / Register
  • Site Logo

    ఉగ్ర లింకుల నేపథ్యంలో నిఘా మరింత పెంచాలి

     ఉగ్ర లింకుల నేపథ్యంలో
      నిఘా మరింత పెంచాలి 

    డీఐజీకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్‌ వినతి

     విశాఖపట్నం. విశాఖ సమాచారం: విజయనగరం జిల్లాలో సిరాజ్‌ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిఘా  మరింతగా పెంచాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టిని మంగళవారం కలసి మాధవ్‌ వినతి పత్రాన్ని అందజేశారు.  ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో సిరాజ్‌ వ్యవహారంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి కూడా భద్రత కొరవడిరదనే భయాందోళనలు కలుగుతున్నాయన్నారు. సిరాజ్‌ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు జరిపి ఈ వ్యవహారంలో సహకారం అందిస్తున్న వారి పై ఉక్కు పాదం మోపాలని, బంగ్లాదేశ్‌ నుండి ఉత్తరాంధ్రకు వస్తున్న రోహింగ్యాల పై నిఘా పెంచాలని కోరారు. విజయనగరంలో యువతను తప్పు దోవ పట్టించి దుశ్చర్యలకు పాల్పడడం, లవ్‌ జిహాద్‌లను ప్రోత్సాహించే ముఠాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.  అదేవిధంగా ఆవులు క్రయ, విక్రయాలు జరిపే ట్రేడర్స్‌పై  పోలీసు యంత్రాంగం నిఘా పెంచాలని మాధవ్‌ కోరారు.

    Leave A Comment