• Login / Register
  • Site Logo

    జెఎన్‌టీయూకే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ

    చదువు
    కాకినాడ రూరల్ (విశాఖ సమాచారమ్) :  జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ మరియు హైదరాబాద్‌లోని స్కిల్ డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా జెఎన్‌టీయూకే విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంటర్న్‌షిప్స్ స్వల్పకాలిక కోర్సులు స్కిల్ ఎన్హాన్స్‌మెంట్ శిక్షణలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌లోని స్కిల్ డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విద్యార్థులకు కంప్యూటర్ మరియు ఐటి స్కిల్స్ ప్రోగ్రామ్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ రంగాల్లో నైపుణ్య శిక్షణలు అందించనుంది. ఈ సందర్భంగా స్కిల్ డిజైర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోఫౌండర్ శ్రీ కాంత్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడమే తమ లక్ష్యమని జెఎన్‌టీయూకే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టీయూకే ప్రొఫెసర్ సిఎన్‌ఆర్కే ప్రసాద్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు యూనివర్సిటీ డైరెక్టర్ యాసీటీకే ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. 
    Download Main Image

    Leave A Comment