న్యూ ఢిల్లీ: గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) తాజాగా ప్రకటించిన “డిజిటల్ స్వరాజ్ మిషన్” లో భాగంగా, భారత్ 2030 నాటికి టెక్నాలజీ స్వావలంబన సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది.
ఈ యోజన ప్రకారం, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక రంగాలలో స్వదేశీ పరిజ్ఞానం, ఉత్పత్తులు అభివృద్ధి చేయడం అత్యవసరమని పేర్కొంది. విదేశీ టెక్నాలజీలపై అధిక ఆధారపడటం దేశానికి దీర్ఘకాలంలో భద్రతా సమస్యలు, ఆర్థిక నష్టాలు కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
GTRI ప్రతినిధులు మాట్లాడుతూ, “డిజిటల్ స్వరాజ్ మిషన్” ద్వారా దేశీయ స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కలసి పనిచేయడం ద్వారా టెక్ స్వదేశీకరణ సాధ్యమని అభిప్రాయపడ్డారు.
👉 నిపుణుల అంచనా ప్రకారం, ఈ ప్రణాళిక అమలు జరిగితే భారత్ 2030 నాటికి స్వంత డిజిటల్ మౌలిక సదుపాయాలు ఏర్పరచుకొని, ప్రపంచంలో ప్రముఖ టెక్ శక్తిగా ఎదగగలదని భావిస్తున్నారు.
Leave A Comment