గుంటూరు నగరంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. మూడేళ్లలోనే తొలిసారి, కేవలం మూడు గంటల వ్యవధిలో సుమారు 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో నగరం మొత్తం జలమయమైంది.
లక్ష్మీపురం, శ్రీనగర్, అరొండెల్‌పేట్, బ్రోడిపేట్, ఓల్డ్ క్లబ్ రోడ్ వంటి ప్రధాన ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. రోడ్లపై 3 నుంచి 4 అడుగుల వరకు నీరు చేరి వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది.
వర్షపు నీరు ఇళ్లలోకి, షాపుల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సేవల సిబ్బంది రాత్రంతా నీటిని బయటకు పంపే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాలలు, కార్యాలయాలు, మార్కెట్లలో పనితీరు దాదాపు ఆగిపోయింది.
వాతావరణ శాఖ అధికారులు గుంటూరు మరియు పరిసర ప్రాంతాల్లో మరికొన్ని గంటల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు రావద్దని సూచించారు.
👉 ఈ వరదల దృష్ట్యా, నగరంలో డ్రైనేజ్ వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Leave A Comment