పరవాడ, (విశాఖ సమాచారమ్):
పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉటగెడ్డ, ఎన్టిపిసి వద్ద మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణ తో కలిసి ఉమ్మడిగా పరవాడ సీఐ మల్లికార్జున రావు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మ్యాన్‌పవర్ కాంట్రాక్టర్ల ద్వారా ఎన్టిపిసి చుట్టు పక్కల కంపెనీలకు కార్మికులను అనధికారికంగా గూడ్స్ వెహికల్స్‌లో తీసుకువెళ్తున్న మూడు వాహనాలు గుర్తించబడ్డాయి.
ఈ వాహనాలను మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ స్వాధీనం చేసుకొని, సంబంధిత డ్రైవర్లపై మొత్తం . 18, వేల రూపాయలను అపరాధ రుసుము విధించారు. వాహనాలను స్వాధీనం చేసుకుని పరవాడ పోలీస్ స్టేషన్లో లో పెట్టడం జరిగింది. గూడ్స్ వెహికల్స్‌లో కార్మికులను తరలించడం అత్యంత ప్రమాదకరమైనదిగా ఉండటంతో, సంబంధిత కంపెనీ యాజమాన్యాలు తమ మ్యాన్‌పవర్ కాంట్రాక్టర్లకు కఠినంగా ఆదేశాలు జారీ చేసి, తప్పనిసరిగా పాసింజర్ వాహనాలు (మ్యాక్సీ క్యాబ్‌లు, పాసింజర్ ఆటోలు మొదలైనవి) మాత్రమే వినియోగించాలనీ సూచించారు.
ఈ తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని, కార్మికుల రవాణాలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
Leave A Comment