తుఫాను సహాయక చర్యలు పై దృష్టి సారించండి
తుఫాను కారణంగా తలెత్తిన నష్టాన్ని అంచనాలు సిద్ధం చేయండి
తుఫాన్ లో సమర్ధవంతంగా పని చేసిన ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు
జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్
పాడేరు/జి మాడుగుల(విశాఖసమాచారం):- తుఫాను కారణంగా తలెత్తిన నష్టాన్ని అంచనా వేయడం, సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ అన్నారు.తుఫాన్ లో సమర్ధవంతంగా పని చేసిన ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ లో నిరంతరంగా క్షేత్ర స్థాయి లో తిరుగుతూ, సమర్ధవంతంగా జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది 24/7 పని చేసారని, వారి సేవలు ఆమోఘమని, వారందరినీ జిల్లా కలెక్టర్ అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన సేవల పట్ల సంతృప్తి చెంది అభినందించారని కలెక్టర్ తెలిపారు. ఇదే స్ఫూర్తి తో ఇంకో రెండు రోజులు పని చేయవలసి ఉంటుందన్నారు. అలాగే గ్రామ స్థాయిలో నాయకులు, యువత ముందుకు వచ్చి ఈ విపత్తు సమయంలో అండ గానిలిచిన ప్రతీ ఒక్కరికి అభినందించారు.విద్యుత్ పునరుద్ధరణ, పంట నష్టం అంచనా, గృహ నష్టం సర్వే మరియు సహాయ కేంద్రాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. తక్షణమే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులపై దృష్టి సారించాలని అధికారులు ఆదేశించారు. రాబోయే 2-3 గంటలలో గరిష్టంగా ఎంతవరకు విద్యుత్‌ను పునరుద్ధరించగలరో అంచనా వేసి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.వ్యవసాయ శాఖ మొదట 150 ఎకరాల వరకు మాత్రమే పంట నష్టం ఉందని నివేదించినప్పటికీ, ఈ సంఖ్య ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున సెన్సిటివ్‌గా వ్యవహరించాలని ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసేటప్పుడు ఫోటోలు, వీడియోలు, పూర్తి డాక్యుమెంటేషన్‌తో కూడిన ప్రిలిమినరీ ఎస్టిమేట్ పంపాలన్నారు, దీని ఆధారంగా పోస్ట్ సైక్లోన్ ఎన్యూమరేషన్ బృందాలను నియమిస్తామన్నారు.
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, మండల్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మరియు ఏడీలు రైతుల వద్దకు వెళ్లి, నీట మునిగిన పంటలకు ఏం చేస్తే బతికే అవకాశం ఉంటుందో సలహాలు ఇచ్చి దగ్గరుండి పనులు చేయించాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలు కలిసి పనిచేస్తూ, తుఫాను వల్ల ఎంత ప్రాథమిక నష్టం జరిగిందో, ఎన్యూమరేషన్ ఎప్పుడు ప్రారంభించాలో తెలియజేస్తూ కంట్రోల్ రూమ్‌కు రియల్ టైమ్ డేటా పంపాలన్నారు.తుఫాను కారణంగా పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న గృహాలు 106 కాగా ప్రతి దెబ్బతిన్న ఇంటికి సంబంధించి, వీఆర్‌ఓలు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కనీసం నాలుగైదు ఫోటోలతో పాటు రిపోర్ట్ పంపాలని ఆదేశించారు. నష్టం తాజాగా తుఫాను వల్లనే జరిగిందా, లేక గతంలోనే ఉందా అనే విషయాన్ని తప్పనిసరిగా ధృవీకరించాలి అన్నారు.నష్టం ఎ స్థాయిలో ఉందొ చూసి ధ్రువీకరించి, ఇంటి యజమాని పేరు, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఫోటోలతో కూడిన పూర్తి వివరాలను పంపాలన్నారు. మండల ప్రత్యేక అధికారి స్పెషల్ ఆఫీసర్లు ఈ నివేదికలను ధృవీకరించి, కౌంటర్‌సైన్ చేసి పంపాలాన్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పాత నష్టపు ఫోటోల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిజమైన బాధితులకు మాత్రమే న్యాయం జరిగేలా దృష్టి సారించాలన్నారు.ప్రస్తుతం 13 పునరావాస కేంద్రాల్లో 774 మందిని తరలించి భోజనం వంటి సౌకర్యాలు కల్పిచడం జరుగుతుందన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారి ఫోటోతో కూడిన పూర్తి వివరాలు అందజేయాలన్నారు.పునరావాస కేంద్రాల్లో కు తరలించబడి వారు కనీసం 24 నుండి 48 గంటలు పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారా లేదా అని నిర్ధారించుకోవాలని, లేదంటే నిజమైన బాధితులకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు.ఎక్స్ గ్రేషియా: రిలీఫ్ సెంటర్లలో 48 గంటలకు పైగా ఉన్నవారికి ప్రభుత్వ జీవో ప్రకారం ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఒక్కరు ఉంటే: రూ 1,000, ఇద్దరు ఉంటే: రూ 2,000, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే: గరిష్టంగా ₹3,000 ఇవ్వడం జరుగుతుందన్నారు.
Leave A Comment